అభిప్రాయాలు
జీవితమంతా బాధల మయం
సుఖాలు మితం
కష్టాలు అమితం
ఈ వ్యవస్థంతా అస్తవ్యస్థం
బ్రతకడమే వ్యర్థం
జీవితం ఆనందాల మయం
ప్రపంచమంతా పచ్చదనం
అనుక్షణం అనుభూతుల మయం
ప్రకృతి అందాలు సజీవం
ఇలా ఉండాలని 'ఆశాజీవి' కోరిక
నేను మాత్రం ఒకప్పుడు అలా
మరోకప్పుడు ఇలా
అనుకుంటూ మధ్య రకంగా
బ్రతికే మానవ జీవిని
కోర్కెల ఊబిలో కొట్టుమిట్టాడే అల్పజీవిని.
- కృష్ణ ప్రసాద్
No comments:
Post a Comment