ప: పూసింది పూసింది పున్నాగా
పూసంత నవ్వింది నీలాగా సందేళ లాగేసే సల్లంగా
దాని సన్నాయి జల్లోని సంపెంగ
ముల్లోకాలే కుప్పెలై జడ కుప్పెలై
ఆడ జతులాడ
పూసింది పూసింది పున్నాగా
పూసంత నవ్వింది నీలాగా
సందేళ లాగేసే సల్లంగా
దాని సన్నాయి జల్లోని సంపెంగ
చ: ఇష్టసఖి నా చిలుక నీ పలుకే బంగారంగా
అష్టపదులే పలికే నీ నడకే వయ్యారంగా
కలిసొచ్చేటి కాలాల కౌగిళ్ళలో కలలొచ్చాయిలే
కలలొచ్చేటి నీ కంటి పాపాయికే కథ చెప్పాయిలే
అనుకోని రాగమే అనురాగ దీపమై
వలపన్న గానమే ఒక వాయులీనమై
పాడే మది పాడే
ప: పూసింది పూసింది పున్నాగా
పూసంత నవ్వింది నీలాగా
సందేళ లాగేసే సల్లంగా
దాని సన్నాయి జల్లోని సంపెంగ
చ: పట్టుకుంది నా పథమే నీ పదమే పారాణిగా
కట్టుకుంది నా కవితే నీ కళలే కళ్యాణిగా
అరవిచ్చేటి ఆభేరి రాగాలకే స్వరమిచ్చావులే
ఇరు తీరాల గోదారి గంగమ్మకే అలలిచ్చావులే
అల ఎంకి పాటలే ఇల పూల తోటలై
పసి మొగ్గ రేకులే పరువాల చూపులై
పూసే విరబూసే
ప: పూసింది పూసింది పున్నాగా
పూసంత నవ్వింది నీలాగా
సందేళ లాగేసే సల్లంగా
దాని సన్నాయి జల్లోని సంపెంగ
ముల్లోకాలే కుప్పెలై జడ కుప్పెలై
ముల్లోకాలే కుప్పెలై జడ కుప్పెలై
ఆడ జతులాడ
Lyricist: Acharya Athreya
Singers: S.P. Balasubhrahmanyam, K.S.Chitra
Music director: M.M. Keeravaani
Movie: Seetharamayya gari manumaraalu
Note: Blue-Male voice
Red-Female voice
No comments:
Post a Comment