Thursday

నా కవిత

పోలిక

 సువాసనలు  వెదజల్లే మామిడి  పూతల  ఇంపు,
 ఇంటి  ప్రక్కనే డ్రైనేజిల కంపు. 

కమ్మని కోకిల గానం చెవులూరించును, 
నానాసైరన్ల, హారన్ల మోత కర్ణబేరి పగిలించును. 

అనుక్షణం అనుభూతుల మయం, 
ప్రతి  క్షణం భయం, భయం. 

కృత్రిమం  తెలియని హృదయాల్లో అనురాగం, 
మాయామర్మాలతో కౌగిలింతల సరాగం. 

ఎటుచూచినా పచ్చని పంట  పొలాలు, 
ఏ  పనికైనా పచ్చనోట్ల రెపరెపలు.

ఒకటి  ప్రకృతి భావనం, రెండవది కృత్రిమ జీవనం. 
ఒకటి మామూలు పల్లెటూరు, ఇంకొకటి గొప్ప పట్టణం.

                                                     - కృష్ణ ప్రసాద్   

No comments:

Post a Comment