Friday

నా కవిత


ఓ ప్రియా 

అరవిరిసిన ముగ్దమందారం 

      పెనవేసిన లతల సింగారం 

ఆరబోసిన పొడి బంగారం 

      వీటిని మించిన నీ ఆకారం 

నా మదిని కలచి వైచింది 

      నా హృదయాన్ని దోచుకున్నది 

ప్రకృతిలో నీరూపాన్ని చూసుకుంటూ 

      ఆకాశంలో నీదేహాన్ని తలచుకుంటూ 

ఈ విశ్వం నీవే అన్నట్లు జీవించే 

      ఈ అల్పజీవికి నీ ఆరాధనతో కూడిన ఒక్క చూపు చాలు.

                                                       - కృష్ణ ప్రసాద్    

No comments:

Post a Comment