Friday

Song lyrics- Naalo Nenena Edo Annana

ప:   నాలో నేనేనా ఏదో అన్నానా నాతో నే లేని మైమరపునా
  
      ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో విన్న మాటేదో నిన్నడగనా

నాలో నేనేనా ఏదో అన్నానా నాతో నే లేని మైమరపునా  

      ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో విన్న మాటేదో నిన్నడగనా 

      అలా సాగిపోతున్న నాలోనా
  
      ఇదేంటిలా కొత్త ఆలోచన 

      మనసే నాది మాటే నీది 

      ఇదేం మాయో

      నాలో నేనేనా ఏదో అన్నానా నాతో నే లేని మైమరపునా  

      ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో చిన్న మాటేదో నిన్నడగనా
చ:   అవునో కాదో తడబాటునీ 

      అంతో ఇంతో గడి దాటనీ

      విడి విడి పోని పరదాని

      పలుకై రానీ ప్రాణాన్ని

      ఎదంతా పదాల్లోన పలికేనా 

      నా మౌనమే ప్రేమ ఆలాపనా

మనసే నాది మాటే నీది ఇదేం మాయో  
  
ప:   నాలో నేనేనా ఏదో అన్నానా నాతో నే లేని మైమరపునా 

      ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో చిన్న మాటేదో నిన్నడగనా   

చ:   దైవం వరమై దొరికిందనీ

      నాలో సగమై కలిసిందనీ
    
      మెలకువ కానీ హృదయాన్ని

      చిగురై పోని శిశిరాన్ని 

      నీతో చెలిమి చేస్తున్న నిమిషాలు 

      నూరేళ్ళుగా ఎదిగిపోయాయిలా

      మనమే సాక్ష్యం మాటే మంత్రం

      ప్రేమే బంధం  

ప:   నాలో నేనేనా ఏదో అన్నానా నాతో నే లేని మైమరపునా  

      ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో చిన్న మాటేదో నిన్నడగనా   

Lyricist:              Ramajogayya sasthry
Singers:              Hemachandra, Saindhavi
Music director:  Manisharama
Movie:                Baanam

Note: Blue-Male voice   

         Red-Female voice

No comments:

Post a Comment