Saturday

నా కవిత

  గుర్తుకువస్తారు 

వేసవి కాలం వేడికి గుర్తుకువస్తారు,


      మురికి కూపాల ఇళ్ళలో ఉక్కిరి బిక్కిరి అయ్యే జనాలు.


శీతాకాలం చలిలో గుర్తుకువస్తారు,


      ఫుట్ పాత్లపై  గజగజ వణికే జీవఛ్చవాలు.


వర్షాకాలం కుండపోతల్లో గుర్తుకువస్తారు,


      ఇంటి పైకప్పులు లేక ఒక మూల కూర్చుని మూలిగే జీవాలు.


ఇవన్నీ తలచుకుంటే అసహనంతో గుర్తుకువస్తారు,


      దేశం సుభిక్షంగా ఉందని ఉపన్యాసాలుదంచే నాయకులు.  

                                                        - కృష్ణ ప్రసాద్    

No comments:

Post a Comment