Tuesday

Song lyrics-Naa cheli rojaave

     (అ....... )
ప: నా చెలి రోజావే నాలో ఉన్నావే 
     నిన్నే తలిచేనే నేనే
     నా చెలి రోజావే నాలో ఉన్నావే 
     నిన్నే తలిచేనే నేనే
     కళ్ళల్లో నీవే కన్నీటా నీవే 
     కనుమూస్తే నీవే ఎదలో నిండేవే 
     కనిపించవో అందించవో తోడు 
     నా చెలి రోజావే నాలో ఉన్నావే 
     నిన్నే తలిచేనే నేనే


     (లల......... )
చ: గాలి నన్ను తాకినా నిన్ను తాకు జ్ఞాపకం 
     గులాబీలు పూసినా చిలిపి నవ్వు జ్ఞాపకం 
     అలలు పొంగి పారితే చెలియ పలుకు జ్ఞాపకం 
     మేఘమాల సాగితే మోహ కథలు జ్ఞాపకం 
     మనసు లేకపోతే మనిషి ఎందుకంట 
     నీవు లేకపోతే  బతుకు దండగంట 
     కనిపించవో అందించవో తోడు 
ప: నా చెలి రోజావే నాలో ఉన్నావే 
     నిన్నే తలిచేనే నేనే
     కళ్ళల్లో నీవే కన్నీటా నీవే 
     కనుమూస్తే నీవే ఎదలో నిండేవే 
     కనిపించవో అందించవో తోడు 
     (అ....... )
చ: చెలియ చెంత లేదులే చల్లగాలి ఆగిపో 
     మమత దూరామాయెనే చందమామ దాగిపో 
     కురులు సిరులు లేవులే పూల వనం వాడిపో 
     తోడు లేదు గగనమా చుక్కలాగా రాలిపో 
     మనసులోని మాట ఆలకించలేవా 
     వీడిపోని నీడై నిన్ను చేరనీవా    
     కనిపించవో అందించవో తోడు 
ప: నా చెలి రోజావే నాలో ఉన్నావే 
     నిన్నే తలిచేనే నేనే
     కళ్ళల్లో నీవే కన్నీటా నీవే 
     కనుమూస్తే నీవే ఎదలో నిండేవే 
     కనిపించవో అందించవో తోడు
     (అ....... ) 


Lyricist:             Raja sri
Singers:             S.P.Balasubhrahmanyam
Music director: A.R.Rehman
Movie:                Roja

Note: Blue-Male voice   

         Red-Female voice

No comments:

Post a Comment