Monday

నా కవిత

నేనేమి చెయ్యను?  

మంచి అంటే ఏమిటో తెలిసినా ఆచరించలేని  

దౌర్భాగ్య స్థితిలోనున్న నా వాళ్ళనుగాంచి సిగ్గుపడనా 

అన్యాయమని తెలిసినా ఎదిరించలేని 

నిర్భాగ్య  స్థితిలోనున్న నా సోదరులను చూసి జాలిపడనా 

సుఖం కరువైనా కర్మ  సిధ్ధాంతాలను నమ్ముకుని  

బ్రతికేస్తున్న నా ప్రజలనుగాంచి సంతోషపడనా 

ప్రపంచపు కీర్తి శిఖరాలపై నా దేశం  నిలబడిందని ఆనందించనా 

నా దేశంలో ఆకలి చావులు అధికమయ్యాయని చింతించనా 

నా దేశంలో అందరికీ ఓటు హక్కు ఉందని గర్వించనా 
సగంమంది ఓటు అమ్ముకుంటున్నారని రోదించనా 

నా దేశంలో బుద్ధుడు పుట్టాడని గొప్పలు చెప్పుకోనా 

తుపాకీ గుళ్ళకు బలైపోతున్న జనాన్ని చూసి తలవంచనా

ప్రపంచపు గగనతలంపై శాంతి కపోతాలు విహరిస్తున్నాయని భ్రమించనా 

ప్రపంచపు నలుమూలలా విషజ్వాలలు అలుముకుంటున్నాయని                                                                                          భీతిచెందనా

నా ప్రజల సమస్యల పరిష్కారానికై పోరుజరపనా 

నేనేమి చెయ్యగలనులే అని నిరాశపడనా 

హాయి కల్గించే ఆనందపు ఊహల్లో తెలిపోనా 

బాధ కల్గించే చేదు వాస్తవాలను నెమరేసుకోనా  

                                                        - కృష్ణ ప్రసాద్    



No comments:

Post a Comment