మన మంచికే! సాధారణంగా ఏం జరిగినా మన మంచికే అనే సందర్భంలో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తాం. కానీ ఇక్కడ విశేషం ఏమిటంటే మన పూర్వీకులు, పెద్దలు చెప్పినవి మన మంచికే అని తెలియజేయడం. అందులో భాగంగా మన పెద్దలు ఏం చెప్పారు అవి మనకు ఎలా మంచి చేశాయి అనేది తెలుసుకుందాం.
భోజనం చేసిన వెంటనే స్నానం చేయకూడదు. ఇది ఏదో ఒక సందర్భంలో మన నానమ్మో, అమ్మమ్మో,బామ్మో లేక తాతయ్యలో అన్న మాటే. కానీ చాలా మంది వినరు. అంతెందుకు చంటిబిడ్డ తల్లులు వారి పిల్లలకు భోజనం తర్వాత స్నానం చేయించడానికే ఇష్టపడతారు. కారణం తినేటప్పుడు మీద పోసుకుంటారు కాబట్టి తర్వాత స్నానం చేయిస్తే బావుంటుందని.
కానీ ఇది తప్పు. ఈ మధ్య పరిశోధనల్లో తేలింది ఏంటంటే భోజనం చేసిన వెంటనే స్నానం చేస్తే జీర్ణక్రియ సరిగా జరగదని తద్వారా అది ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని.
So ఒప్పుకుంటారా! పెద్దలు చెప్పినవి మన మంచికే అని.
No comments:
Post a Comment